AP Covid Update : ఏపీలో కొత్తగా 141 కోవిడ్ కేసులు నమోదు

UPDATED 26th FEBRUARY 2022 SATURDAY 05:45 PM

AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న కొత్తగా 141 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,329 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర కోవిడ్ నియంత్రణా విభాగం ఈరోజు విడుదల చేసిన తాజా బులెటిన్ లో పేర్కొంది. దీంతో, రాష్ట్రంలో ఇంతవరకు 23 లక్షల 17 వేల 964 మందికి కొవిడ్ సోకగా, వారిలో 22 లక్షల 99 వేల 362 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 3,518 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కోవిడ్ వల్ల చిత్తూరులో ఒకరు, కృష్ణాజిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు కోవిడ్ సంబంధిత కారణాలతో మరణించారు. ఇంతవరకు రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 14 వేల 725 కి చేరింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us