కారు - నాన్-స్టాప్ బస్సు డీ

UPDATED 17th MARCH 2018 SATURDAY 10:00 PM

సామర్లకోట: పెద్దాపురం- సామర్లకోట ఎడిబి రహదారిలో రాక్ సిరామిక్స్ సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న సంఘటనలో కారు డ్రైవర్ మృతి చెందాడు. కాకినాడలో సబ్-రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న అధికారి రాజమహేంద్రవరం నుంచి కాకినాడ కారులో వెళుతుండగా, రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు ను ఓవర్ టేక్ చేస్తూ బలంగా ఢీకొట్టింది. బస్సు వెనుక వస్తున్న చెరుకు ట్రాక్టర్ సడన్ బ్రేకు వేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. డ్రైవర్ రాజమహేంద్రవరంకు చెందిన అనిల్ దాస్ గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని డి.ఎస్.పి చిలకా వెంకట రామారావు, సి.ఐ. ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్. ఐ. ఎల్. శ్రీనివాస్ నాయక్, ట్రైనీ ఎస్.ఐ సతీష్, తదితరులు పరిశీలించారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us