ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి

UPDATED 24th SEPTEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని,   
స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు.  సోమవారం సాయంత్రం పాఠశాలలో ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి, ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి  ఓటరు చైతన్యవంతం కావాలన్నారు. ఎన్నికల కమిషన్ పాఠశాల స్థాయిలో 14 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులను భవిష్యత్ ఓటర్లుగా భావించి వారికి ఓటుహక్కుపై చైతన్యవంతులుగా చేయడానికి లిటరసీ క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. లిటరసీ క్లబ్  నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయురాలు జి.  రమాదేవి మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. గోవిందు, ఎం. చంద్రమోహన్, బాలాజీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us