నటనలో, జనాకర్షణలో ట్రెండ్ సెట్టర్ మెగాస్టార్

UPDATED 22nd AUGUST 2017 TUESDAY 11:30 AM

దాదాపు నాలుగు దశాబ్దాల కిందట తెలుగు సినీ ప్రపంచంలో వీచిన ఓ ప్రభంజనానికి జనం నీరాజనం పట్టారు. ఆ ప్రభంజనం పేరే చిరంజీవి. అంతవరకు ఉన్న తెలుగు సినిమాల ఒరవడిని మార్చి టాలీవుడ్ కు కొత్త ఒరవడిని కల్పించి ఒక న్యూ ఏజ్ క్రియేట్ చేసిన సాహసి చిరంజీవి. మూడేళ్ల పిల్లాడి దగ్గర్నుంచి, తొంభై ఏళ్ల పండు ముదుసలి వరకు అందరికీ తెలిసిన చిరంజీవి పుట్టిన రోజు ఈ రోజు. కొంతమందిలో గొప్ప ఆకర్షణ ఉంటుంది. వాళ్లను చూడగానే జనం ఫిదా అయిపోతారు. అలాంటి మేగ్నెటిక్ అట్రాక్షన్ ఉన్న హీరో చిరంజీవి. ఆయనకు కోట్లాది మంది అభిమానులు, వీరాభిమానులు ... ఇంతమంది ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. అనితర సాధ్యం అని కూడా అనవచ్చు. చిరంజీవి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఆయనలో ఉన్న స్పీడ్. అంతవరకు స్లో మూవ్ మెంట్స్ తో సాగిన తెలుగు సినిమాలు చిరంజీవి వచ్చాక స్పీడందుకున్నాయి. స్టెప్స్ లో స్పీడ్, డాన్సుల్లో స్పీడ్. అంతేకాదు చిరంజీవి వచ్చాక హీరో బాడీ లాంగ్వేజ్ మారింది. డాన్సుల్లో కానీ, యాక్షన్ సీన్స్ లో కానీ శరీరాన్ని మెలికలు తిప్పుతూ యాక్ట్ చేయడం చిరంజీవితోనే మొదలైంది. సినిమాల్లోకి రాకముందు ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందిన చిరంజీవి నటనలోనూ విభిన్నత్వాన్ని ప్రదర్శించాడు. చిరంజీవి నటనలో స్పీడ్ మాత్రమే కాదు, గంభీరత్వమూ ఉంది. నలుగురినీ నవ్వించే చిలిపితనమూ ఉంది. నటనలో నవరసాలే కాదు నలభై రసాలూ ప్రదర్శించిన ఘనుడు చిరంజీవి. చిరంజీవి అంటే ఆంజనేయుడు. అలాగే ఈ శివశంకర వరప్రసాద్ కూడా ఆంజనేయుడి భక్తుడు. ఆంజనేయుడిలా సాహసి. సినిమాల్లోకి వచ్చేటప్పుడు చిరంజీవికి ఎవరి బ్యాకింగ్ లేదు. స్వయంకృషితో పైకి వచ్చి, టాలీవుడ్ లో కింగ్ గా మారి, మెగాస్టార్ కావడం ఈ మెగాధీరుడికే చెల్లింది. మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ ట్రెండ్ సెట్టర్. ఓ మేరునగధీరుడు, ఓ ఎవరెస్ట్. అందుకే మూవీ కెరీర్ లో తొమ్మిదేళ్ల గ్యాప్ వచ్చినా ఆడియన్స్ లో ఆయన ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. ఖైదీ నంబర్ 150 మూవీ దానికి నిలువెత్తు నిదర్శనం. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సినిమాకు వరం ఈ వరప్రసాదుడు. ప్రస్తుతం తన 151 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నాడు చిరు. ఆయన బర్త్ డే సందర్భంగా కొద్ది క్షణాలలో చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నాడు రామ్ చరణ్. మన మెగాస్టార్ రానున్న రోజులలో మరిన్ని చిత్రాలతో అలరించాలని, ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us