సీయం జగన్‌కు లోకేశ్ లేఖ

అమరావతి (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: ‘‘ఉభయగోదావరి జిల్లాల్లో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంటకు నష్టమొచ్చింది. పొలాలతోపాటు రైతుల కళ్లల్లోనూ నీళ్లు నిండి... ఎక్కడ చూసినా దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి’’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. అకాల వర్షాలకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పంట నష్టపోయి రైతులు పడుతున్న ఇబ్బందులపై శనివారం ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. ‘‘పంట చేతికందే సమయంలో నీట మునగడంతో రైతు కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఈ ఏడాది వచ్చిన వరుస తుపాన్లతో రెండుసార్లు నాట్లు వేసి పంట కోల్పోయారు. మరోసారి చేతికొచ్చిన పంటని అకాల వర్షాలు మింగేశాయి. నిర్వహణ సరిగాలేక డ్రైన్లు పొంగి పొలాలను ముంచాయి. తడిచిన, రంగుమారిన ధాన్యమంటూ తక్కువ రేటుకు కొనేందుకు దళారులు ప్రయత్నిస్తుంటే... ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. అధికారులేమో.. 33% నష్టం వాటిల్లితేనే పంటనష్టం నమోదు చేస్తామనే నిబంధన పెట్టి రైతులను వేధిస్తున్నారు’’ అని వివరించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రైతు భరోసా కేంద్రాల వద్దా ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదని లోకేశ్‌ విమర్శించారు. ప్రభుత్వం రైతుకు వరికి హెక్టారుకు రూ.50 వేలు పరిహారమివ్వాలని కోరారు
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us