కలుషితాహారం తిని 40 మందికి అస్వస్థత

UPDATED 10th OCTOBER 2017 TUESDAY 6:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో కలుషితాహారం తిని 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే గ్రామంలో సోమవారం నిర్వహించిన ఓవేడుకలో సుమారు 1400 మంది మాంసాహారాన్ని భుజించారు. అయితే భుజించిన వారిలో కొంతమందికి అకస్మాత్తుగా వాంతులు, విరోచనాలు, జ్వరం, తలనొప్పి రావడంతో భయంతో వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో విషయం తెలుసుకున్న తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎంపీడీవో పల్లాబత్తుల వసంతమాధవి, ఈవోపీఆర్డీ కరక  హిమామహేశ్వరి అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అలాగే కాండ్రకోట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులకు సమాచారం అందచేశారు. దీంతో వైద్యులు అక్కడకు చేరుకొని వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందచేశారు. అలాగే గ్రామంలో సర్వేలెన్స్ నిర్వహించారు. అలాగే డీఎంహెచ్ చంద్రయ్య ఆదేశాల మేరకు డీపీఎంవో కేశవప్రసాద్, ఎపిడమిక్ సూపర్ వైజర్లు ప్రసాద్, జాన్సన్ రాజు బాధితుల రక్త నమూనాలను సేకరించారు. ఎంఎంసీ ఛైర్మన్ ముత్యాల వీరభద్రరావు(రాజబ్బాయి), ఎంపీపీ గుడాల రమేష్, ఎంపీటీసీ సభ్యుడు కల్తూరి శ్రీనివాస్ భాదితులను  పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us