కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకోవాలి

UPDATED 1st APRIL 2018 SUNDAY 6:00 PM

పెద్దాపురం: ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రం మెడలు వంచైనా సరే హక్కులను కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దువ్వా శేషుబాబ్జి  పేర్కొన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ, మండల పరిధిలో నిర్వహించిన జాతా కార్యక్రమాల్లో ఆయన ఆదివారం పాల్గొని మాట్లాడారు. ముందుగా పట్టణంలో ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజుతో కలిసి ఆయన జండా ఊపి జాతాను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీలకు అతీతంగా తాము కలిసి పోరాడతామని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి కావలసిన వనరులను సాధించుకునేందుకు తమ పార్టీ తరుపునుంచి పోరాటాలు చేస్తామన్నారు. జననేన నియోజకవర్గ నాయకుడు తుమ్మల రామస్వామి (బాబు) మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ తరుపునుంచి ఉద్యమాలు చేయడంతో పాటు సిపిఎంతో కలిసి నడుస్తామన్నారు. అలాగే ప్రజా నాట్యమండలి ఆద్వర్యంలో ప్రత్యేక హోదాపై పాడిన గీతాలు పలువురుని విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం జాతా దివిలి, తిరుపతి, చదలవాడ, కాండ్రకోట మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నీలపాల సూరిబాబు, సిరిపురపు శ్రీనివాస్, కంచుమర్తి కాటంరాజు, కూనిరెడ్డి అరుణ, గడిగట్ల సత్తిబాబు, దారపురెడ్డి కృష్ణ , తదితరులు పాల్గొన్నారు. 
 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us