అర్జున్ రెడ్డి భామ‌కి ఆఫర్ల వెల్లువ‌

UPDATED 18th OCTOBER 2017 WEDNESDAY 4:00 PM

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చిన షాలిని పాండే ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించింది. దీంతో ఈ భామకి ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే మ‌హాన‌టి చిత్రంలో షాలిని జ‌మున పాత్ర పోషిస్తుంద‌ని తెలుస్తుండ‌గా, 100శాతం కాద‌ల్ అనే త‌మిళ సినిమాకి సైన్ చేసినట్లు సమాచారం. ఇక‌ తెలుగులో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో రాబోతోన్న నయా మూవీలోను ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో నివేథా థామ‌స్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ప్ప‌టికి స్పెష‌ల్ పాత్ర కోసం షాలిని పాండేని సెల‌క్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఏదిఏమైనా సరే షార్ట్ టైంలో ఇలా వ‌రుస ఆఫ‌ర్లు అందుకోవ‌డం గొప్ప విశేష‌మే. రానున్న రోజుల‌లో షాలిని పాండే త‌న న‌ట‌న‌తో మ‌రిన్ని ఆఫ‌ర్స్ అందుకుంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us