పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ప్రణాళికలు దోహదం

UPDATED 30th APRIL 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ఆవాస ప్రాంత విద్యా ప్రణాళిక, పాఠశాల అభివృద్ధి ప్రణాళికలపై స్థానిక సిబిఎమ్ సెంటినరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ఎంఈవో వైవి శివరామకృష్ణయ్య మాట్లాడుతూ 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల మౌలిక సౌకర్యాలకు ఈ ప్రణాళికలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఉపాధ్యాయులు ఈ ప్రణాళికలకు సంబందించిన నిర్దేశిత ఫారాలు పూర్తి చేసి  ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తి చేసిన ఫారాలు మే నెల ఒకటో తారీకు ఉదయం11 గంటల లోపు అందచేయాలని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో పూర్వపు ఎంఇవో పి. జాన్, 79 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us