ప్రజా సమస్యలపై పోరాటమే జనసేన లక్ష్యం

UPDATED 2nd APRIL 2019 TUESDAY 10:00 PM

పెద్దాపురం: ప్రజా సమస్యలపై పోరాటమే జనసేన పార్టీ లక్ష్యమని పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలోని 14,15,16,17,18,19 వార్డులతో పాటు మండల పరిధిలోని జె. తిమ్మాపురం, కట్టమూరు గ్రామాల్లో మంగళవారం ఇంటింటికీ విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఈ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. పట్టణ పరిధిలోని స్థానిక గౌరీ కోనేరుకు చెందిన సుమారు 50 మంది యువత జనసేన పార్టీలో చేరారు. వారికి తుమ్మల రామస్వామి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన సభ్యునిగా పోటీ చేస్తున్న తనకు ఒక్క అవకాశమివ్వాలని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జనసేన ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని, నీతి నిజాయితీ కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ జనసేన అన్నారు. ఈ కార్యక్రమంలో తమనార లక్ష్మణ దివాకర్‌, తుమ్మల సూర్యకృష్ణమూర్తి, అత్తిలి సీతారామస్వామి, వెంకటలక్ష్మి, పిట్టా జానకిరామయ్య, ఇంటి ఉమా మహేశ్వరావు, నున్న గణేష్ నాయుడు, శ్రీకాంత్, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.        

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us