ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల కడప పర్యటన ఖరారు :

UPDATED 5th JULY 2022 TUESDAY 08:58

AM Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జులై 7వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరి గన్నవరం చేరుకుంటారు. అక్కడ 9-30కి విమానంలో బయలుదేరి 10-20 కి కడప చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి పులివెందుల వెళతారు.

అక్కడ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో కాసేపు విశ్రాంతి తీసుకుని స్ధానిక ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం ఒంటి గంటకు పులివెందులలో నిర్నిస్తున్న న్యూటెక్ బయో సైన్సెస్‌కు శంకుస్ధాపన చేస్తారు. మధ్యాహ్నం గం. 2-50 కి హెలికాప్టర్ లో వేంపల్లి వెళతారు. అక్కడ స్ధానిక నాయకులతో సమావేశం అవుతారు. కొన్ని అభివృధ్ది కార్యక్రమాల్లో పాల్గోని సాయంత్రం గం. 5-25కి రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్ కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

8వ తేదీ ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఘాట్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గోంటారు. అక్కడి వైఎస్సార్ సమాధి వద్ద తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పిస్తారు. గం 8-55 కి అక్కడ నుంచి బయలు దేరి ఇడుపులపాయ హెలిపాడ్‌కు చేరుకుంటారు.

హెలికాప్టర్ లో బయలుదేరి అక్కడి నుంచి 9-10 కి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 9-50 కి కడప ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి ఉదయం 10-20కి గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలు దేరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్లీనరీకి చేరుకుని అక్కడి కార్యక్రమాల్లో పాల్గోంటారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us