బాల‌య్య 102 వ చిత్రానికి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్!

UPDATED 5th JULY 2017 WEDNESDAY 7:30 PM

నంద‌మూరి బాల‌కృష్ణ జోరు అభిమానుల ఆనందానికి అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతుంది. రీసెంట్ గా గౌత‌మి పుత్ర శాత‌కర్ణి చిత్రంతో ఫ్యాన్స్ ని అల‌రించిన బాలయ్య ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పైసా వ‌సూల్ చేస్తున్నాడు. సెప్టెంబ‌ర్ 29న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఈ మూవీ త‌ర్వాత కె.ఎస్. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య త‌న 102వ చిత్రాన్ని చేయ‌నున్నాడు. జ‌య‌సింహ అనే టైటిల్ తో ఈ మూవీ కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. అయితే చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ తాజాగా తన సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘రూలర్’ అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. దీంతో అభిమానులు బాల‌య్య 102వ చిత్రానికి టైటిల్ రూల‌ర్ అని చెప్పుకుంటున్నారు. ఆగ‌స్ట్ రెండో వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుండ‌గా, త‌మిళనాడులోని కుంభ‌కోణంలో చిత్ర తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. స‌మ‌రసింహారెడ్డి స్టైల్ లోనే ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించ‌నుండ‌గా, హీరో శ్రీకాంత్ విల‌న్ పాత్ర పోషించ‌నున్నాడ‌ని టాక్.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us