కిట్స్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం

Updated 24th April 2017 Monday 2:30 PM

పెద్దాపురం: పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ సేవా యూనిట్  ఆధ్వర్యంలో తిరుపతి గ్రామంలో స్థానిక మండల పరిషత్ పాఠశాలలో సోమవారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ శిబిరాన్ని కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ కళాశాల ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఈ నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతీ ఒక్కరూ తమ నేత్రాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు  వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ వైద్య శిబిరంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు తమ వైద్య సేవలను అందించారు. సుమారు 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందచేశారు. ఈ కార్య క్రమంలో కిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, సర్పంచ్ మెయిళ్ల కృష్ణమూర్తి, ఏవో కెఆర్ సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసివొ కొంగర పెదకాపు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎం. సత్తిబాబు, డాక్టర్ ఏవిడి దుర్గాప్రసాద్, హరికృష్ణ, బి.లక్ష్మి, కె.లక్ష్మి, బి.సౌజన్య, పి.మంజుల, ఎస్ఎంసి చైర్మన్ జట్ల చంద్రరావు, హెచ్ఎం శివయ్య తదితరులు పాల్గొన్నారు.              

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us