ప్రతీ పేద కుటుంబానికి రూ.ఐదు వేలు ఆర్థికసాయం అందించాలి

సామర్లకోట, 25 ఏప్రిల్ 2020(రెడీబీన్యూస్): పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సామర్లకోట మండలం అచ్చంపేటలోని తన నివాసంలో 12 గంటల నిరాహారదీక్షను మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శనివారం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు.కరోనా విపత్తు కారణంగా ప్రతీ పేద కుటుంబానికి రూ.ఐదు వేల ఆర్థిక సాయం అందించాలన్నారు. మూసివేసిన అన్న క్యాంటీన్ లను వెంటనే ప్రారంభించాలని, చంద్రన్న భీమాను పునరుద్ధరించాలన్నారు. అలాగే ధాన్యం,మిర్చి,పత్తి, పండ్ల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని పేర్కొన్నారు.సెరి కల్చర్,ఆక్వా కల్చర్,పౌల్ట్రీ రంగాలను ఆదుకోవాలన్నారు.కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది,పోలీసులు, ఇతర అధికారులకు రక్షణ కిట్లు అందించాలన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us