25 తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్న బాలీవుడ్!

REDBEENEWS:

Bollywood Remakes: సౌత్ హీరోలే కాదు.. సౌత్ కథలంటే కూడా ఫుల్ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. మాస్ ను మెప్పించే ఇక్కడి సినిమాలంటే నార్త్ ఆడియెన్స్ కళ్లప్పగిస్తున్నారు. జనాల ఇష్టాన్ని క్యాష్ చేసుకునే పనిలో భాగంగా ఒకటి కాదు రెండు ఏకంగా పాతిక సినిమాలను రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ వాళ్లు..

ఒకప్పుడు నార్త్ సినిమాల్లోని లైన్స్ తీసుకుని మన నేటివిటీకి తగ్గట్టు మార్చి థియేటర్స్ కి తీసుకొచ్చేవాళ్లు టాలీవుడ్ దర్శకనిర్మాతలు. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది. సౌత్ డామినేషన్ పెరిగింది. హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా ప్రొజెక్ట్ అవుతుంటే.. ఇక్కడి పాన్ ఇండియా కథలు బాలీవుడ్ జనాల్ని ఆకర్షిస్తున్నాయి. అందుకే రీమేక్ చేస్తే పోలే అనుకుంటున్నారు నార్త్ మేకర్స్. అందులో భాగంగానే పాతిక పైగా కథలను ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు..

నాని నటించిన జెర్సీ సినిమాను షాహిద్ కపూర్ అదే పేరుతో రీమేక్ చేశాడు. కొవిడ్ కారణంగా వాయిదాపడిన ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. అటు జనవరి 26న రిలీజ్ కాబోతున్న అలవైకుంఠపురములో డబ్బింగ్ వర్షన్ కు.. ఒరిజనల్ కూడా తెరకెక్కతుంది. కార్తీక్ ఆర్యన్, కృతీసనన్, పరేశ్ రావల్ వంటివారితో షెహ్ జాదా పేరుతో అల వైకుంఠపురములో రీమేక్ తెరకెక్కిస్తున్నారు. మనీషా కోయిరాల ఇందులో టబూ రోల్ చేస్తుంది..

సూర్య సూపర్ హిట్ ఆకాశమే నీ హద్దురా సినిమా త్వరలోనే బాలీవుడ్ సెట్స్ పైకెళ్లనుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్నాడు. అటు మార్చి 18న డేట్ ఫిక్స్ చేసుకున్న బచ్చన్ పాండే.. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేశ్ ను ఆధారంగా చేసుకొని రాబోతుంది. అలాగే అక్షయ్ కుమార్ చేతిలో బెల్లంకొండ రాక్షసుడు రీమేక్ మిషన్ సిండ్రెల్లా కూడా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో లేడీ లీడ్ గా కనిపించబోతుంది..

అజయ్ దేవగణ్ కూడా సౌత్ కథలపై ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం కార్తీ హీరోగా వట్టిన ఖైదీని రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీకి భోళా అనే టైటిల్ అనౌన్స్ చేశారు. అల్లరి నరేశ్ నాంది సినిమా రీమేక్ కూడా అజయ్ చేతిలో ఉంది. అటు దృశ్యం 2కి కూడా త్వరలోనే ముహూర్తం పెట్టబోతున్నారు..

హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కాంబోలో విక్రమ్ వేదా రీమేక్ తెరకెక్కుతోంది. సేమ్ డైరెక్టర్స్ గాయత్రి పుష్కర్ ఈ సినిమాను అక్కడా డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే అపరిచితుడు సినిమాను రణ్ వీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా శంకర్ ప్రకటించాడు. లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు షో టచ్ ఇవ్వబోతున్నాడు స్టార్ డైరెక్టర్ శంకర్..

శ్రద్ధా శ్రీనాథ్, సమంతా వంటివారు నటించిన యూటర్న్ ను ఏక్తాకపూర్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంది. ఆలయ ఎఫ్ ఇందులో కీ రోల్ చేయబోతుంది. అలాగే విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మాతగా వచ్చిన హిట్ రీమేక్ లో రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నాడు. సైమ్ డైరెక్టర్ శైలేష్ కొలను వర్క్ చేస్తుండగా దిల్ రాజు కో ప్రొడ్యూసర్ గా ఈ రీమేక్ ను నిర్మిస్తున్నారు..

అయ్యప్పనుమ్ కోషియుమ్ ఇక్కడ భీమ్లా నాయక్ గా రాబోతుంది. ఇదే సినిమాను బాలీవుడ్ లోనూ తెరకెక్కిస్తున్నారు. అలాగే రామ్ రెడ్ సినిమాను సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా షూట్ చేయబోతున్నారు. ఇదే సిద్ధార్ధ్ మల్హోత్రా లీడ్ రోల్ లో బన్నీ మూవీ దువ్వాడ జగన్నాథమ్ కూడా సెట్స్ పైకెళ్లింది..

మలయాళీ హిట్ హెలెన్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టబోతుంది జాన్వీ కపూర్. మరో మలయాళ బ్లాక్ బస్టర్ డ్రైవింగ్ లైసెన్స్ మూవీలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. మాస్టర్ మూవీ రీమేక్ హక్కులు కూడా బాలీవుడ్ మేకర్స్ దగ్గరున్నాయి. విజయ్ చేసిన రోల్ ని సల్మాన్ ఖాన్, విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ ని సైఫ్ అలీఖాన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి..

ఎఫ్2 రీమేక్ రైట్స్ దక్కించుకున్న బోనీకపూర్.. అర్జున్ కపూర్ హీరోగా బాలీవుడ్ ఫన్ డోస్ ను స్టార్ట్ చేయబోతున్నారు. వెంకీ రోల్ ను ఎవరు చేస్తారనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్, రాజమౌళి ఫస్ట్ హిట్ ఛత్రపతిని హిందీలో రీమేడ్ చేస్తున్నారు. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే.. బెల్లంకొండ శ్రీనినాస్ హీరో కాగా.. వివి వినాయక్ డైరెక్షన్ చేస్తున్నారు. తెలుగువాళ్లైన హీరో, డైరెక్టర్.. తెలుగు సూపర్ హిట్ ను హిందీలో చూపించబోతున్నారు..

గాడ్ ఫాదర్ గా చిరూ రీమేక్ చేస్తున్న లూసిఫర్ హిందీలోనూ రాబోతుంది. శింబు రీసెంట్ హిట్ మానాడుపై అక్కడివారూ కన్నేశారు. అలాగే శ్రీవిష్ణు, నివేథా థామస్ లీడ్ రోల్స్ చేసిన బ్రోచేవారెవరురా ను హిందీలో తీస్తున్నారు. కరణ్ డియోల్. అభయ్ డియోల్ నటిస్తున్న ఈ మూవీని అజయ్ దేవగణ్ నిర్మిస్తున్నాడు. జులాయి, క్రాక్, అరుంధతి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మానగరం, కోమలి, 16.. ఇలా బాలీవుడ్ రీమేక్ లిస్ట్ లో చాలానే ఉన్నాయి.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us