TS News: మతపరమైన హింసను బీజేపీ ఎక్కడా రెచ్చగొట్టలేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని.. అది ఆయనకు తగదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ వినాలంటేనే ప్రజలు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బాధ్యత గల సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మతపరమైన హింసను బీజేపీ ఎక్కడా రెచ్చగొట్టలేదని చెప్పారు. టీఆర్ఎస్ నేతల ప్రచారం రైతులను తప్పుదారి పట్టించేలా ఉందని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాల్సి మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us