రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

UPDATED 12th FEBRUARY 2018 MONDAY 8:00 PM

సామర్లకోట: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జి.మేడపాడు గ్రామంలో కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని ఆదుకుంటున్న కుమారుడికి తునిలో ఉద్యోగం వచ్చిందని ఆ ఆనందంలో మహేష్ ఉద్యోగంలో చేరడానికి తన తండ్రి బురిడి వెంకటరమణ (43) సోమవారం కలిసి మోటార్ సైకిల్ పై వెళ్లారు. వేట్లపాలెం సమీపంలోనికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది. దీంతో తండ్రి వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు తీవ్రంగా గాయాలవడంతో 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us