Bandi Sanjay : కేసీఆర్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

UPDATED 16 FEBRUARY 2022 WEDNESDAY 12:50 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా బీజేపీ – టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దీంతో బీజేపీ కౌంటర్ ఇస్తోంది. 2022, ఫిబ్రవరి 16వ తేదీ బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

బీజేపీ జరుపుతున్న ఆందోళనకు ఆకర్షితులై, టీఆర్ఎస్ పై పోరాటం కోసం పార్టీలో చేరిన నేతలకు స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ కోసం ‘యువ తెలంగాణ పార్టీ’ బీజేపీలో విలీనం అయ్యిందన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us