సత్యదేవుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 19 నవంబర్ 2021:‌ అన్నవరం సత్యదేవుని దర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. పౌర్ణమి పర్వదినం రోజున స్వామిని దర్శించుకోవడానికి వేలాది మంది వచ్చిన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు. అధికసంఖ్యలో 9,581 వ్రతాలు, 67 కల్యాణాలు జరిగాయి. వ్రతాలు, పూజలు, సర్వదర్శనాలు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ. 84.04 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. స్వామి, అమ్మవార్ల పల్లకీ సేవ జరిగింది. వెండి తిరుచ్చీ వాహనంపై ప్రాకారసేవ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయగా వర్షంతో ఆటంకం ఏర్పడింది. స్వామి, అమ్మవార్లను పల్లకిలో ఆశీనులను చేసి ప్రధానాలయం వద్ద (రూ.800 వ్రతమండపాల మీదుగా) సేవ నిర్వహించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రాత్రి జరగాల్సిన పంపా హారతుల కార్యక్రమాన్ని రద్దు చేశారు. క్షేత్ర రక్షకులుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యంగిర హోమం నిర్వహించారు

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us