AP News: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ప్రగతి తీవ్రంగా దెబ్బతిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా.. కేవలం 45 శాతం రెవెన్యూ మాత్రమే దక్కిందన్నారు. 2015-16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.15,454గా ఉంటే.. ఏపీలో రూ.8,979 మాత్రమే ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. విభజన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేసేందుకు ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన జగన్‌.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, పెండింగ్‌ సమస్యలపై చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి జగన్‌ వినతి పత్రం అందించారు. మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్‌ భేటీ అయ్యారు. ‘‘భౌగోళికంగా చూస్తే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌ పెద్దది. జనాభా కూడా ఎక్కువే. ప్రజల అవసరాలను తీర్చాలన్నా, వారికి సరైన సేవలు అందించాలన్నా.. అదే స్థాయిలో వ్యయం కూడా చేయాల్సి ఉంటుంది. విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయింది. మౌలిక సదుపాయాలను కోల్పోయాం. వాటి కోసం భారీగా ఖర్చు చేశాం. అందుకే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీతో పాటు అనేక హామీలు ఇచ్చారు. వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుంది. కానీ, చాలా హామీలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి’’ అని ప్రధానికి వివరించారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us