పోలీసుల సేవలు భేష్ : ఎంపీ వంగా గీతావిశ్వనాథ్

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 27 అక్టోబర్ 2021: ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసే సేవలు భేష్ అని కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ఆయుధాలకు సంబంధించి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసులు ప్రజలకు సేవలు అందించడం జరిగిందన్నారు. కరోనా బారినపడి ఎంతో మంది పోలీసులు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోలీసులు విధులు నిర్వహించి ప్రజలకు రక్షణ కల్పిస్తారని వారు పేర్కొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us