ధరిత్రి రక్షణ మన అందరి బాధ్యత

UPDATED 21st APRIL 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: ధరిత్రి రక్షణ మన అందరి బాధ్యతని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు అన్నారు. స్థానిక అయోధ్య రామపురం బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 48వ ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు శనివారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమీషనర్ హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు, ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, స్వచ్ఛ సామర్లకోట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కాపాడాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయి రామకృష్ణ మాట్లాడుతూ ధరిత్రి దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన భారీ ర్యాలీని కమీషనర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, కెరీర్ ఫౌండేషన్ విజ్ఞానధార తదితర అంశాల విజయాలకి పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు ఫౌండేషన్ సర్టిఫికెట్లు, బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ టీచర్ ఎఎల్.వి. కుమారి, కెరీర్ ఫౌండేషన్ ఉపాధ్యాయులు ఎ.పి. రాజేంద్రకుమార్, కె.ఎస్. శివ, షఫీయుల్లా, డి.వి.వి. సత్యనారాయణ, కె . అరుణ, భద్రావతి, పి.ఇ.టి  వెంకటేశ్వర్లు, చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us