టిడిపి పాలనలోనే అన్నివర్గాలకు న్యాయం

UPDATED 13th FEBRUARY 2019 WEDNESDAY 8:00 PM

పెద్దాపురం: అన్ని వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, రాష్ట్రానికి మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం పట్టణంలో సిఐఐపి నిధులు రూ.40 కోట్లుతో చేపట్టనున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 14వ వార్డులో రూ.146.80 లక్షలు వ్యయంతో నిర్మించిన సిసిరోడ్డును మంత్రి బుధవారం ప్రారంభించారు. అలాగే పాత తహసీల్దార్ కార్యాలయంలో గల స్త్రీశక్తి భవనంలో నూతనంగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలకు పసుపు-కుంకుమ క్రింద 92 మంది సభ్యులకు రూ.9 లక్షల 20 వేలు విలువగల చెక్కులను మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీ రైతు కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రంలో 96 లక్షల మంది మహిళలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహకారం అందించడం జరిగిందని అన్నారు. అలాగే నూతనంగా ఏర్పడిన మహిళా సంఘాలకు ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందని, త్వరలో డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందచేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నిరంగాల్లోను మహిళలను ఆదుకోవడం జరిగిందని చినరాజప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరిపూరిరాజు, మహారాణి సత్రం చైర్మన్ తూతిక రాజు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, ఏపిఎం వేదకుమారి, టిడిపి నాయకులు  రంధి సత్యనారాయణ, కమ్మిల సుబ్బారావు, గుమ్మళ్ళ రామకృష్ణ, కొత్తెం కోటి, వార్డు కౌన్సిలర్లు, వెలుగు సిబ్బంది, డ్వాక్రామహిళలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us