సీమెన్స్ సర్టిఫికెట్లు పొందిన గైట్ విద్యార్థులు

UPDATED 6th JULY 2018 FRIDAY  6:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలలో ఇసిఇ, ఇఇఇ విభాగాలకు చెందిన 128 మంది విద్యార్థులకు సీమెన్స్ సంస్థ సర్టిఫికెట్లు అందచేసింది. గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీ శశివర్మ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులను అభినందించారు. వేసవి శిక్షణ 45 రోజులు పాటు విద్యార్థులు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. గైట్ అకడమిక్ డీన్ శిక్షణా కార్యక్రమం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం. వరప్రసాదరావు మాట్లాడుతూ సీమెన్స్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్సెస్ ఫంక్షనింగ్ ఎక్విప్మెంట్ అండర్ స్టాండింగ్ అనే అంశంపై విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ఎపిపిఎస్సి నుంచి ఏడుగురు రిసోర్స్ పర్సన్స్ శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లీలావతి, గైట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వల్లీ మాధవి, గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, సిఇఇ, ఇసిఇ విభాగాధిపతులు డాక్టర్ బి. సుజాత, కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.              

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us