ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యులపై పిల్‌ దాఖలైనట్టు పత్రికా ప్రకటన ఇవ్వండి: హైకోర్టు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో 18 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులు సభ్యులుగా ఉండటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసినా ఎవరూ కౌంటర్లు దాఖలు చేయలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 15 మంది నోటీసులు తీసుకోగా.. ముగ్గురు సభ్యులు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. నోటీసులు తీసుకోని బోర్డు సభ్యులు అల్లూరి మహేశ్వరి, ఎమ్మెల్యే రాం భూపాల్ రెడ్డి, ఎంఎన్‌ శశిధర్ లపై పిల్ ఫైల్ అయినట్టు పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us