ముగిసిన జ్ఞానధార

UPDATED 9th JUNE 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జ్ఞానధార ప్రత్యేక విద్యాబోధనా కార్యక్రమాలు శనివారం ముగిసినట్లు ఎంఈవో వై.వి. శివరామకృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ శిక్షణా తరగతులు ఎంతగానో సహకరిస్తాయని అన్నారు. అనంతరం ఈ తరగతులకు హాజరైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు ఎంఈవో అందచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వనలత, ఉపాధ్యాయులు టి.వి.వి. సత్యన్నారాయణ, సిఆర్పీలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us