NEET UG 2022-23 : నేడు నీట్‌ యూజీ 2022-23 ప్రవేశ పరీక్ష..13 భాషల్లో ఎగ్జామ్

UPDATED 17th JULY 2022 SUNDAY 09:00 AM

NEET UG 2022-23 : నేడు నీట్‌ యూజీ 2022-23 ప్రవేశపరీక్ష జరుగనుంది. MBBS, BDS అనుబంధ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరుగనుంది. దేశవ్యాప్తంగా 18.72 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థుల్లో 10.64 లక్షల మంది మహిళలు ఉన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష జరుగనుంది. 13 భాషల్లో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూలో పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు.

దేశ వ్యాప్తంగా 497 పట్టణాల్లో నీట్ పరీక్ష జరుగనుంది. 2021తో పోలిస్తే ఈ సంవత్సరం 2.57 లక్షల మంది ఆశావాహులు పెరిగారు. 12 భారతీయ భాషలలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య 74.3 శాతానికి పెరిగింది. తమిళంలో పరీక్ష రాసేవారి సంఖ్య 60 శాతం పెరిగింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ సహా ఇతర ప్రాంతీయ భాషల్లో నీట్‌ పరీక్ష రాసే అవకాశం కల్పించారు.MBBS, BDS, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద, మెడిసిన్ సర్జరీ (BAMS), బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ (BSMS), బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (BUMS), బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్‌లలో ప్రవేశానికి అర్హత ప్రవేశ పరీక్షగా నీట్ యూజీ ఉంది. మహారాష్ట్ర (2.5 లక్షలు), యూపీ (2.1 లక్షలు) రాష్ట్రాల నుంచి నీట్ పరీక్ష కోసం అభ్యర్థులు భారీగా నమోదు చేసుకున్నారు. కర్ణాటక (1. 3 లక్షలు), కేరళ (1. 2 లక్షలు), రాజస్థాన్ (1. 4 లక్షలు), తమిళనాడు(1. 4 లక్షలు) అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం అభ్యర్థుల్లో ఆరు రాష్ట్రాల నుంచి దాదాపు 55 శాతం మంది అభ్యర్థులు ఉన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 90 వేల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌లు అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 25 పట్టణాల్లో 115 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగనుంది. తెలంగాణ నుంచి నీట్ పరిక్షకు 60 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us