వైద్యుల నియామకానికి ధరఖాస్తుల ఆహ్వానం

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 21 నవంబర్ 20210: జిల్లాలో పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో ప్రత్యేక వైద్యశాలలు(స్పెషలిస్ట్‌ క్లినిక్‌లు) నిర్వహించేందుకు కాంట్రాక్ట్‌ పద్ధతిలో ప్రత్యేక వైద్యుల నియామకాలకు దరఖాస్తులు కోరుతున్నామని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి గౌరీశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు, విద్యార్హతలు, వయసు, ఇతర వివరాలకు eastgodavari.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. తమ దరఖాస్తులకు సంబంధిత ద్రువపత్రాలను జతచేసి ఈనెల 25 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో అందించాలని కోరారు. స్పెషలిస్టులకు ఒక్కో విభాగంలో 13 చొప్పున పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో గైనకాలజీ, జిరియాట్రిక్‌, పీడియాట్రిక్స్‌, ఈఎన్‌టీ, స్కిన్‌, ఆర్థోపెటిక్స్‌, చెస్ట్‌, ఎన్‌సీడీ, జనరల్‌ సర్జరీ ఉన్నాయి.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us