అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

UPDATED 27th DECEMBER 2017 WEDNEDAY 9:30 PM

కాకినాడ: నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకల నేపథ్యంలో కోడిపందేలు, గుండాట, అశ్లీల నృత్యాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పండుగల పేరుతో నిర్వహించే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు ఇప్పటికే డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శకాలను నిర్దేశించామన్నారు. జూదం, కోడిపందేలు, గుండాట, అశ్లీల నృత్యాలు వంటివి నిర్వహించినా, అందుకు ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోడిపందేలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్వహణ ప్రజల దృష్టికి వస్తే తక్షణమే పోలీస్‌ వాట్సాప్‌ నంబరు 94949 33233 కు వివరాలను పంపాలని లేదా 100 నంబరుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us