చంద్రబాబును మళ్లీ సీఎం చేసితీరుతాం :ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 22 నవంబరు 2021 : టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ సీఎం సీటులో కూర్చోబెడతామని, అందుకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులంతా అహర్నిశలూ శ్రమిస్తామని ఎమ్మెల్యే, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శాసనసభలో చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరిని అవమానపరిచేవిధంగా వైసీపీ నాయకులు విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులతో కలిసి పట్టణంలో సోమవారం ఆయన ధర్నా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి స్థానిక మున్సిపల్‌ సెం టర్‌కు ర్యాలీగా టీడీపీ శ్రేణులతో వచ్చారు. అలాగే అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో మంత్రి కన్నబాబు తనకు సంబంధించిన వ్యవసాయ శాఖ గురించి మాట్లాడకుండా హెరిటేజ్‌ డెయిరీ కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పనికట్టుకుని కేవలం చంద్రబాబుపై విమర్శలు చేయడానికే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కంకణం కట్టుకున్నారని, శాసనసభలో చంద్రబాబుపైకి దూసుకువెళుతుంటే తానే అడ్డుపడ్డానన్నారు. తుపాన్లు వచ్చి రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే పట్టించుకోకుండా కేవలం చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమ ర్శించారు. సభను సజావుగా సాగేందుకు మంత్రులు ఎవరూ సహకరించకుండా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై సాధారణ దాడులు పెరగడంతోపాటు లైంగిక దాడులు పెరిగిపోయాయన్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతోపాటు ఇసుక కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రజల్లోకి ప్రభుత్వ వైఫలాల్యను తీసుకువెళతామని, చంద్రబాబును మళ్లీ సీఎంని చేసి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, ఏరియా ఆసుపత్రి మాజీ చైర్మన్‌ బొడ్డు బంగారుబాబు, పార్టీ నేతలు పాలకుర్తి శ్రీనుబాబు, తాళాబత్తుల సాయి, నూనే రామారావు, తూతిక రాజు, మన్యం దేవబాబు తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us