UPDATED 9th JUNE 2022 THURSDAY 03:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) జూన్ 9 : పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని పందిరి రాట ముహూర్త కార్యక్రమాన్ని గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆలయ అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మీ ఆధ్వర్యంలో వేద పండితుల పవిత్ర మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆషాఢమాసంలో జరగనున్న అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి తొలి గరగలను తీయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు చిట్టెం గోపాలశర్మ, రాయి విజయ్ కుమార్, దేవస్థానం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.