అత్రిరాత్ర యాగంలో పాల్గొన్న హోంమంత్రి చినరాజప్ప

UPDATED 17th APRIL 2018 TUESDAY 5:30 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో జరుగుతున్న అతిరాత్ర మహాగ్నిచయన పూర్వక మహోత్కృష్ట సోమయాగం నాల్గవ రోజైన మంగళవారం రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజుతో కలిసి సందర్శించారు. ముందుగా యాగశాల ఆవరణలో హేమసాయిరామ్ అన్నపూర్ణా ఛారిటబుల్ ట్రస్ట్ వారి షిరిడిసాయి వాహన మందిరాన్ని సందర్శించి బాబావారిని దర్శించుకున్నారు. అనంతరం యాగపర్యవేక్షణ కర్త కేశాప్రగడ  హరిహరనాథ శర్మతో కలిసి వేదస్వస్తి, ఉదయ ప్రైషం, వ్రతదోహం, సోమపూజనం, విష్ణుక్రమణం, ఉఖ్యాగ్ని సమిన్ధనం, వ్రతపానం తదితర కార్యక్రమాలలో పాల్గొని, అనంతరం అభిషేక తీర్థాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ అతివృష్టి, అనావృష్టి, వరదలు, తుఫాన్లు, తదితర ప్రకృతి వైపరీత్యాలు నుంచి  మానవులను కాపాడటానికి పెద్దాపురంలో అతిరాత్ర యాగాన్ని నిర్వహించడం అదృష్టమని, ప్రతి ఒక్కరూ ఈ యాగాన్ని తిలకించి స్వామివారి కరుణకు పాత్రులవ్వాన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, తూతికరాజు, వార్డు కౌన్సిలర్లు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us