భీమేశ్వరస్వామి ఆలయానికి జనరేటర్ బహూకరణ

UPDATED 31st JULY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధి పంచారామ క్షేత్రమైన శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి వారి ఆలయానికి బుధవారం దాతలు జనరేటరును బహూకరించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి తెలిపారు. దేవస్థానంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా ఉండేందుకు సామర్లకోట పట్టణానికి చెందిన డాక్టర్ బేతిన పాపారావు జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు డాక్టర్ బుల్లి జోగినాధ్, డాక్టర్ తాళ్లూరి గాయత్రీదేవి, డాక్టర్ మెర్ల వి.జె.రామ్ ఈ జనరేటరును బహూకరించారు. అనంతరం వారు స్వామి, అమ్మవార్లు, ఉపాలయాలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణమూర్తి మాట్లాడుతూ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీకుమారరామ భీమేశ్వరస్వామి దేవస్థానం దాతల సహాయ, సహకారాలతో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు కొంతేటి జోగారావు, వేమూరి సోమేశ్వరశర్మ, రాంబాబు, సుబ్బన్న, సభ్యులు పడాల వీరబాబు, దూది రాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us