భీమేశ్వరాలయంలో వైభవంగా కోటి దీపోత్సవం

UPDATED 26th NOVEMBER 2019 TUESDAY 9:00 PM 

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): స్థానిక పంచారామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం మంగళవారం భక్తులతో పోటెత్తింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆలయంలో కోటి దీపోత్సవం పూజలు వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు దీపోత్సవ సంకల్పం పఠించి, షోడశోపచారాలు, విశేష పూజలు నిర్వహించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు మట్టపల్లి రమేష్, దీపారాధన సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఒక్కసారిగా దీపాలు వెలిగించడంతో దేవాలయ ఆవరణం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగింది. సాయంత్రం స్వామివారికి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, అర్చనలతో పాటు జ్యోతిర్లింగార్చన పూజలు నిర్వహించారు. దీపారాధన సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సామర్లకోట ఎస్ఐ  సుమంత్, ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ కోటి దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు రాజశేఖరశర్మ, వేమూరి సోమేశ్వరశర్మ, కొంతేటి జోగారావు, సన్నిధిరాజు సుబ్బన్న, వెంకన్న, చెరుకూరి రాంబాబు, భీమన్న, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us