AP News: ఎన్ని పార్టీలు జట్టుకట్టినా.. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది: పెద్దిరెడ్డి

అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: తెలుగుదేశం పార్టీ ముసుగులో అమరావతి ఉద్యమం సాగుతోందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో ఎలాగైనా జట్టు కట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని పార్టీలు జట్టుకట్టినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ తిరుపతిలో అమరావతి మహా ఉద్యమసభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. ఈనేపథ్యంలో పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us