సమాచారం నమోదులో అలసత్వం వహిస్తే సహించేది లేదు

* జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ 
* వ్యవసాయ అధికారులతో జేసీ సమీక్ష   

UPDATED 13th AUGUST 2020 THURSDAY 9:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): జిల్లాలో పంట సాగు హక్కు పత్రాల పంపిణీ లక్ష్యాలకు అనుగుణంగా సాధించాలని, సమాచారం నమోదులో అలక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా జాయింట్ కలక్టర్ (ఆర్) డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మండల, డివిజన్ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ వరినాట్లు, సాగు హక్కు ధృవీకరణ పత్రాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ-క్రాప్ బుకింగ్ లో నమోదు చేయాలన్నారు. మండల, డివిజన్ అధికారులు గ్రామస్థాయి సిబ్బందితో కలిసి సమన్వయంతో పని చేయాలని సూచించారు. సాగు హక్కు పత్రం పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 8886613611 నంబరుకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కె.ఎస్.వి. ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ వి.జె. రామారావు, సహాయ వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us