TTD:తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్ల సంఖ్య పెంపు

UPDATED 22 FEBRUARY 2022 TUESDAY 01:00 PM

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 24 నుంచి అదనపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అలాగే మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మార్చి నెలకు సంబంధించి సర్వదర్శన టికెట్లను రోజుకు 20 వేలకు పెంచిన టీటీడీ.. నిత్యం 5 వేల చొప్పున అదనపు కోటా కింద జారీ చేయనుంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టిక్కెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us