America : లాస్ ఏంజిల్స్‌‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్

UPDATED 20th MARCH 2022 SUNDAY 10:30 AM

Minister KTR Tour : మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో మంత్రి కేటీఆర్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. కాసపటి క్రితం లాస్‌ఏంజిల్స్‌ చేరుకున్నారు. అక్కడ మంత్రి కేటీఆర్‌కు ఎన్‌ఆర్‌ఐలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఎన్‌ఆర్‌ఐలతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమాన్ని వారికి వివరించారు. మన ఊరు – మనబడి కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్‌ఆర్‌ఐలకు పిలుపునిచ్చారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు. మంత్రి కేటీఆర్ తో పాటు అధికార బృందం కూడా ఉంది. లాస్‌ఏంజిల్స్‌, శాన్‌డియాగో, శాన్‌జోస్‌, బోస్టన్‌, న్యూయార్క్‌ నగరాల్లో పర్యటించనున్నారు. ప్రముఖ కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో చర్చలు జరుపనుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us