సూర్యబలిజలను అన్నివిధాలా ఆదుకుంటాం

UPDATED 31st DECEMBER 2017 SUNDAY 6:00 PM

పెద్దాపురం: సూర్యబలిజ సామాజిక వర్గాన్ని ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని, వారికి రూ.10 లక్షలు వ్యయంతో కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా స్థానిక 28వ వార్డు దర్గాపేట సాయిబాబా దేవాలయం వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం సూర్యబలిజ సంఘానికి కమ్యూనిటీ భవనం నిర్మిస్తామన్నారు. విద్యాపరంగా సూర్యబలిజ విద్యార్థుల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. పెద్దాపురాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్ధేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, రాబోయే సంవత్సరంలో నూరుశాతం అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. యువత సూర్యబలిజ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా కమ్యూనిటీకి మంచి సేవలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ సూర్యబలిజ కులస్తులకు కమ్యూనిటీ భవనం నిర్మించడానికి అనువైన స్థలం అందుబాటులో లేక ఆలస్యమైదన్నారు. సూర్యబలిజ కులస్థుల్లో పేదవారికి స్వర్గీయ జాన్ డేవిడ్ ఎఎంజి సంస్థ ద్వారా ఆర్ధిక సహాయం అందించేవారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ స్థలాన్ని జాన్ డేవిడ్ పేరుమీద సూర్యబలిజ కులస్తులకు కమ్యూనిటీ భవనం నిర్మించడానికి ఆయన కుమారులు అంగీకరించారన్నారు. వచ్చే సంవత్సరం మే నాటికి కమ్యూనిటీ భవనం పూర్తి చేస్తామన్నారు. సూర్యబలిజ సామాజికవర్గంలోని పేదలకు 55 సంవత్సరాలకే పింఛన్ వర్తింపచేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా చైర్మన్ మంత్రిని కోరారు. సూర్యబలిజ సంఘ అధ్యక్షుడు అన్నాబత్తుల అంజిబాబు మాట్లాడుతూ సంఘానికి కమ్యూనిటీ భవనం మంజూరు చేసినందుకు హోంమంత్రి, చైర్మన్ లకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సూర్యబలిజ జిల్లా కార్యదర్శి రామ్మోహనరావు, యువజన అధ్యక్షుడు ధరణికోట యోహాన్, ధరణికోట సత్తిబాబు, మాంతరపు సూరిబాబు, సాలూరి వెంకటేశ్వరావు, కోటిపల్లి నారీమణి, ధరణికోట పెద్దరాజు, మద్దుల వీరబాబు, తూతిక రాజు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.                    

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us