పవన్ 25వ మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల

UPDATED 7th NOVEMBER 2017 TUESDAY 7:00 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో పవన్ 25వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ బర్త్ డే సందర్భంగా చిత్రానికి సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ తో పాటు మ్యూజికల్ వీడియోని విడుదల చేసి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన యూనిట్ తాజాగా త్రివిక్రమ్ బర్త్ డే గిఫ్ట్ గా మ్యూజికల్ వీడియో ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. "బైటికొచ్చి చూస్తే" అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10, 2018న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుండగా, ఈ మూవీకి టైటిల్ ఏంటి అనే దానిపై మాత్రం ఇప్పటికి క్లారిటీ లేదు. అజ్ఞాత వాసి, రాజు వచ్చినాడో, ఇంజనీర్ బాబు అంటూ పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికి వీటిపై క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ ఐటీ నిపుణుడి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us