కృష్ణ వంశీ న‌క్షత్రం రెడీ

UPDATED 16th JULY 2017 SUNDAY 7:00 PM

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ సినిమాలంటే ఆడియ‌న్స్ లో ఎంత‌టి క్రేజ్ ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌క్ష‌త్రం అనే సినిమా తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో సందీప్ కిషన్, రెజీనా, సాయి ధ‌ర‌మ్ తేజ్, ప్ర‌గ్యా, త‌నీష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లినా, ఇంతవరకు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌లేదు. దాంతో అభిమానుల‌లో సినిమా రిలీజ్ పై అనేక సందేహాలు నెల‌కొన్నాయి. అయితే న‌క్ష‌త్రం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ అన్నీ పూర్తి చేసుకొని, రీసెంట్ గా పాట‌ల పండుగ జ‌రుపుకుంది. చిత్రంలోని పాట‌లు ఆడియ‌న్స్ కి మంచి ఆనందాన్నిఇచ్చాయి. అయితే చిత్ర రిలీజ్ కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్న అభిమానుల‌కు మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. ఈ చిత్రాన్ని జులై 28న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మూవీ బిజినెస్ కూడా స్పీడుగా జ‌రుపుకోగా, మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంద‌ని యూనిట్ భావిస్తుంది. న‌క్ష‌త్రం చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్ క్రూషియ‌ల్ రోల్ లో క‌నిపించ‌నున్నాడు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us