మన్మధుడికి వెరీ హ్యపీ బర్త్ డే

UPDATED 29th AUGUST 2017 TUESDAY 12:30 PM

టాలీవుడ్ మన్మథుడు, అభిమానులకు కింగ్ ...అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఈ రోజు. అతని ఫ్యాన్స్ కు పండగే పండగ. ఫేవరేట్ హీరో నాగ్ బర్త్ డేని అభిమానులు ఆనందంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాలపరంగా ఈ ఏడాది ఓం నమో వేంకటేశాయ విడుదలైంది. ఇందులో మరోసారి భక్తుడి పాత్ర వేసి మెప్పించాడు. ఇంతవరకు ఏ నటుడూ వేయని హాథీరాం బాబా పాత్ర ధరించి అతను అచ్చం ఇలాగే ఉంటాడు అనిపించాడు. ఇక నాగార్జున నటించిన మరో చిత్రం రాజుగారి గది -2 రిలీజ్ కావాల్సి ఉంది. నాగ్ గురించి చెప్పాలంటే వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన ఊపిరి సక్సెస్ కావడమే కాకుండా... సామాజిక ప్రయోజనం ఉన్న చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ రెండూ నాగార్జునకు అంతులేని ఉత్సాహాన్ని ఇచ్చాయి. నాగార్జున ప్రస్తుతం తన కొడుకు అఖిల్ మూవీ కెరీర్ గురించి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. గత ఏడాది కొన్ని పనుల వత్తిడివల్ల అఖిల్ మూవీపట్ల నాగ్ అంతగా శ్రద్ధ తీసుకోలేకపోయాడు. ఇప్పుడు రాజుగారి గది -2 తర్వాత అఖిల్ రెండో మూవీ రిలీజయ్యేంతవరకూ తను మరే సినిమా చేయకూడదని కూడా డిసైడ్ అయ్యాడట నాగార్జున. సాంఘిక సినిమాల్లోనూ, పౌరాణిక పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్న నాగార్జున తన సినిమాలతో అలరించడమే కాదు రానున్న రోజులలో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us