కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

జేసీ కీర్తి చేకూరి

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 17 నవంబర్ 2021: గ్రామాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దడానికి అధికారులు చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్‌(అభివృద్ధి) కీర్తి ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో ఆమె రంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ఆదిత్య, జడ్పీ సీఈవో సత్యనారాయణ, డీపీవో నాగేశ్వర్‌నాయక్, ఇతర అధికారులతో సమీక్షించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 262 చెత్త సేకరణ కేంద్రాలను త్వరగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రంపచోడవరం డివిజన్‌లో రూ.15 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. జగనన్న పల్లె వెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాలు సక్రమంగా వెలిగేలా చూడాలన్నారు. స్వచ్ఛ సంకల్పంలో భాగంగా పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు. ఏజెన్సీ, సబ్‌ప్లాన్‌ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ మిత్రలు, గ్రీన్‌ అంబాసిడర్ల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూస్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us