అంగరంగ వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం

UPDATED 20th APRIL 2018 FRIDAY 9:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో వేంచేసి ఉన్న గోవిందమాంబా సమేత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కల్యాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కల్యాణ వేడుక అనంతరం గ్రామంలో రథోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us