డ్రిల్ చేస్తుండగా కుప్పకూలారు

UPDATED 25th JUNE 2017 SUNDAY 6:00 PM

పెద్దాపురం: డ్రిల్ చేస్తుండగా ఎన్ సి సి విద్యార్థులు కుప్పకూలిన సంఘటన ఆదివారం పెద్దాపురం మహారాణీ కళాశాలలో జరిగింది. 18వ ఆంధ్రా బెటాలియన్ విద్యార్థులు రోజూలాగే ఉదయం అల్పాహారం తిన్న తర్వాత డ్రిల్ చేస్తున్నారు. ఇంతలో 12 మంది విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకుంటూ కుప్పకూలారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తమై తరలించారు. విద్యార్థులు ఉదయం తిన్న అల్పాహారం కారణంగా ఇలా జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్పాహారం తిన్న వెంటనే డ్రిల్ చెయ్యడమే కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. విషయం తెలిసిన వెంటనే హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అక్కడకు చేరుకొని  పరిస్థితిని సమీక్షించారు. అలాగే అస్వస్థతకు గురైన  విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అలాగే ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు విద్యార్థులను పరామర్శించారు. ఇదిలా ఉండగా అస్వస్థతకు గురైన విద్యార్థులను మందులు బయట నుంచి తెచ్చుకోవాలని అక్కడి సిబ్బంది ఇబ్బందులకు గురిచెయ్యడం ప్రజల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది.

 

 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us