UPDATED 25th FEBRUARY 2022 FRIDAY 08;:30 AM
Crime News: కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒంటిమిట్ట చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మరో ఇద్దరు కారుతోపాటు గల్లంతయ్యారు. కారులో గల్లంతై మృతి చెందిన వారు చంద్రగుప్త, మహంకాళిగా గుర్తించారు పోలీసులు. కారులో కాళహస్తికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే కారు ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో నుంచి బయటపడే ప్రయత్నంలో ఈత రాకపోవడంతో ఇద్దరు గల్లంతయినట్లుగా తెలుస్తోంది.