అమరావతి (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : ధార్మిక పరిషత్ సభ్యుల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎస్, దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి, అధికారులకు నోటీసులిచ్చింది. ధార్మిక పరిషత్ సభ్యుల సంఖ్య తగ్గిస్తూ తెచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. 21మంది సభ్యుల పరిషత్‌ను నలుగురికి పరిమితం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని న్యాయవాది వాదించారు. న్యాయవాది వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. చట్టంపై స్టే ఇవ్వాలని ఉమేశ్ చంద్ర కోర్టును కోరారు. ప్రభుత్వం కౌంటర్ వేశాక దానిపై పరిశీలిస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అనంతరం దీనిపై విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. సినిమా టికెట్ ధరల పిటిషన్‌పై విచారణ వాయిదా.. సినిమా టికెట్ ధరల పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సినిమా టికెట్ ధరల నియంత్రణను సవాల్ చేస్తూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అఫిడవిట్ దాఖలుకు అడ్వకేట్ జనరల్ సమయం కోరారు. దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది.