Updated 20th April 2017 Thursday 11:45 AM
పెద్దాపురం: రోజురోజుకూ సమాజంలో పాత్రికేయుల పై పెరిగిపోతున్న దాడులను అరికట్టాలని గురువారం పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. రాజమహేంద్రవరంలో టీవీ 5 ప్రతినిధుల పై గీతా ముళ్ళపూడి ఇంటర్నేషనల్ ఆసుపత్రి యాజమాన్యం దాడి చేయడాన్ని పెద్దాపురం పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భం గా పలువురు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో మీడియా ప్రతినిధులపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారికి రక్షణ కరువైందని ఆoదోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల రక్షణ కు ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే దాడిలో గాయపడిన వారికి న్యాయం చేయాలని, దాడికి పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు చల్లా విశ్వనాథం, రాకుర్తి రాంబాబు, వినాయక్, ఆలీ, మున్ని, సుధాకర్, సుబ్రహ్మణ్యం (సుబ్బు) , శ్రీకాంత్, ఎస్ ఎల్ రెడ్డి, విజయ్, తదితరులు పాల్గొన్నారు.