మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

UPDATED 9th JULY 2018 MONDAY 7:00 PM

పెద్దాపురం: ప్రతీ నియోజకవర్గ పట్టణాల్లో ఆయుష్ భవనాలను నిర్మిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఎన్.టి.ఆర్ వైద్యసేవల నిధులతో రూ.40 లక్షలతో 10 పడకల అదనపు వార్డు భవనాన్ని ప్రారంభించి, యోగా, నేచురోపతి బ్లాక్ ఆయుష్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించతలపెట్టిన ఆయుష్ భవనానికి స్పీకర్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపి తోట నరసింహంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా స్పీకర్ డాక్టర్ శివప్రసాదరావు నూట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 50 పడకల ఆసుపత్రిని భవిష్యత్తులో 100 పడకల ఆసుపత్రిగా మార్చడానికి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కృషి చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ ఏరియా ఆసుపత్రిలో ఆయుష్ ద్వారా హోమియోపతి, యోగా, నేచురోపతి వంటి వైద్య సేవలు కూడ అందచేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు అందిస్తున్న వైద్యం పట్ల శ్రద్ధచూపి మానవతా దృక్పదంతో సేవలందించాలని అన్నారు. పట్టణాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకురావడానికి మంత్రి చినరాజప్ప కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం, సామర్లకోట ఆసుపత్రులు అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపి తోట నరసింహం మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రికి ఎంపి నిధులు నుంచి అంబులెన్సు ఏర్పాటు చేస్తానని తెలిపారు. అనంతరం పాండవులమెట్టపై ఉన్న శతాబ్ది పార్కు, అలాగే వాలు తిమ్మాపురంలో నిర్మిస్తున్న అందరికీ ఇళ్ళు గృహ సముదాయాలను స్పీకర్ హోంమంత్రి, ఎంపీలతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, ఆర్డీవో ఎస్.ఎస్.బి.బి. వసంతరాయుడు, తహసీల్దార్ గంగుమళ్ల బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ రవికాంత్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ నరసింహగుప్త, ఎపిఎంఎస్ఐడిసి సి. కేశవరావు, వి రత్నరాజు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us