AP News : తల్లి చనిపోయిందని తెలియని పసివాడు..‘నిద్రపోమ్మా..నేను స్కూల్ కెళ్తున్నా’..అంటూ నాలుగు రోజులుగా..

UPDATED 12th MARCH 2022 SATURDAY 11:20 AM

Andhra Pradesh : తల్లి చనిపోయిందని కూడా తెలిసిన పసివాడు ఆ పిల్లాడిది. అమ్మ నిద్రపోతోందనుకున్నాడు. నిద్రపోతున్న అమ్మను ఇబ్బంది పెట్టకూడదనుకున్నాడు. అందుకే అమ్మా నువ్వు నిద్రపో..నేను స్కూల్ కు వెళుతున్నా అంటూ చనిపోయిన తల్లికి చెప్పి రోజూ స్కూల్ కు వెళుతున్నాడు పదేళ్ల పిల్లాడు. హృదయాలను పిండేసే ఘటన ఏపీలోని తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుపతి విద్యానగర్‌ కాలనీలో తల్లి మృతదేహంతోనే పదేళ్ల పిల్లాడు నాలుగు రోజులు ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అమ్మ రాజ్యలక్ష్మి నిద్ర పోతోందని పదేళ్ల కుమారుడు శ్యామ్‌ కిషోర్‌ అనుకున్నాడు. కానీ చనిపోయిందని కూడా ఆ పసివాడికి తెలియదు. కుటుంబ కలహాలతో రాజ్యలక్ష్మి భర్తకు దూరంగా కొడుకు శ్యామ్ కిషోర్ తో కలిసి విద్యానగర్‌ కాలనీలో ఉంటోంది. ప్రైవేట్‌ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తు కొడుకును పోషించుకుంటోంది రాజ్యలక్ష్మి. ఈ క్రమంలో మార్చి 8న ఇంట్లో కిందపడిన రాజ్యలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. పడిపోయిన ఉన్న తల్లిని చూసిన శ్యామ్ అమ్మ నిద్రపోతోంది అని అనుకున్నాడేమో..నాలుగు రోజులుగా తనకు తానే రెడీ అయి స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు. వచ్చాక చనిపోయిన తల్లిపక్కనే పడుకుంటున్నాడు.

ఇంట్లో ఉన్న ఏమో తినుబండారాలతో నాలుగు రోజులుగా అలాగే ఉంటున్నాడా పసివాడు. ఏదో తిని మంచం పక్కన తల్లి మృతదేహంతోనే పడుకుని నిద్రపోతున్నాడు. కానీ రోజులు గడిచేకొద్దీ ఇంట్లో ఏదో దుర్వాసన వస్తోందని తెలిసింది. అది తల్లి మృతదేహం నుంచే నని మాత్రం తెలియలేదు.దీంతో శ్యామ్‌ కిషోర్‌ మేనమామ దుర్గాప్రసాద్‌కు ‘‘మామ మా ఇంట్లో ఏదో దుర్వాసన వస్తోంది అని చెప్పాడు. వచ్చి సోదరి రాజ్యలక్ష్మి మృతదేహం చూసిన దుర్గా ప్రసాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ కోసం ఆస్పత్రికి తరలించారు. పాపం నాలుగేళ్ల శ్యామ్‌ కిషోర్‌ మానసిక స్థితి సరిగా లేదని దుర్గాప్రసాద్‌ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us